అన్నమయ్య, 2026-11-18
విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
విధి నిర్వహణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ () డ్రైవర్లు, కండక్టర్లు మరియు ఇతర సిబ్బందిపై దాడికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని అధికారులు హెచ్చరించారు.
ప్రయాణికులకు సేవ చేయడమే ధ్యేయంగా రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై కొంతమంది దుండగులు దాడికి పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో, ప్రజలకు అవగాహన కల్పించేందుకు అన్ని బస్సులు మరియు బస్ స్టాండ్లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది.
విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడం చట్టరీత్యా శిక్షార్హమైన నేరం. భారత న్యాయ సంహిత () లోని 121, 122, 132 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి, 2 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడుతుంది.
కావున ప్రయాణికులందరూ సిబ్బందితో మర్యాదగా ప్రవర్తించి, సంస్థకు సహకరించవలసిందిగా కోరుతున్నాము.
ఏదైనా సమస్య ఉంటే సంబంధిత డిపో మేనేజర్ గారికి లేదా టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చు. ఈ మేరకు జిల్లా ప్రజా రవాణా అధికారి, అన్నమయ్య జిల్లా ఒక ప్రకటనలో తెలిపారు.







