విజయవాడలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉండగానే సీఐ అహ్మద్ అలీ గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం ఉదయం అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ వద్ద ఈ ఘటన జరిగింది.
సీఐ అహ్మద్ అలీ ఆదివారం ఉదయం విధుల్లో భాగంగా అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ వద్ద ఉన్నారు. అకస్మాత్తుగా ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన సహచర సిబ్బంది ఆయనను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నప్పటికీ, పరిస్థితి విషమించడంతో సీఐ అహ్మద్ అలీ తుదిశ్వాస విడిచారు. విధి నిర్వహణలో ఉండగానే ఒక అధికారి మృతి చెందడం పోలీసు శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది.












