Bapatla/Karamchedu (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 08
కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలోని పోలింగ్ బూత్ 187ను ఎమ్మార్వో మాధవి లత బుధవారం సందర్శించారు. ఎస్ఐర్ (SIR) డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, అర్హులను ఓటర్లుగా నమోదు చేయాలని ఆమె బీఎల్వోలను ఆదేశించారు.
కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలోని పోలింగ్ బూత్ 187ను ఎమ్మార్వో మాధవి లత బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎస్ఐర్ (SIR) డిజిటలైజేషన్ ప్రక్రియను బీఎల్వోలు మరింత వేగవంతం చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా నమోదు చేయాలని, ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహిస్తూ నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.








