పెద్దపల్లి, జూలై 11
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (HRCI) సంస్థ క్రమశిక్షణ, ప్రోటోకాల్ మరియు రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అమృతం వీరా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, పెద్దపల్లి జిల్లా ఉమెన్ వింగ్ అధ్యక్షురాలు జాగటి శాంతపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ అనంతరం ఆమెను పదవి నుంచి తొలగించి, అడిషనల్ జనరల్ సెక్రటరీగా డీ-ప్రమోట్ చేశారు.
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (HRCI) సంస్థ క్రమశిక్షణ, ప్రోటోకాల్ మరియు రాజ్యాంగ నిబంధనలకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తుందని, వాటిని ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సహించేది లేదని ఆ సంస్థ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అమృతం వీరా స్పష్టం చేశారు.
ఇటీవల హెచ్.ఆర్.సి.ఐ ఉమెన్ వింగ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి జాగటి శాంత వ్యవహారశైలిపై అందిన పలు ఫిర్యాదుల నేపథ్యంలో సంస్థ అంతర్గతంగా సమగ్ర విచారణ జరిపినట్లు ఆయన వెల్లడించారు. విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలు, క్రమశిక్షణా ఉల్లంఘనలను పరిగణనలోకి తీసుకుని, సంస్థ నియమావళి ప్రకారం ఆమెపై క్రమశిక్షణా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర అధ్యక్షులు ప్రకటించారు.
ఇందులో భాగంగా శ్రీమతి జాగెటి శాంతను పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలి పదవి నుండి డీ-ప్రమోట్ (పదవి తగ్గింపు) చేస్తూ, ఆమెను పెద్దపల్లి జిల్లా అడిషనల్ జనరల్ సెక్రటరీగా నియమించినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై జిల్లా అధ్యక్షులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా లేదా వారి అనుమతి లేకుండా ఎలాంటి సంస్థాగత కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. సంస్థ ప్రోటోకాల్‌ను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతమైతే మరింత కఠిన చర్యలు ఉంటాయని అధికారికంగా హెచ్చరించారు.
హెచ్.ఆర్.సి.ఐ లో పదవి ఏదైనా కావచ్చు, ప్రతి సభ్యుడు సంస్థ రాజ్యాంగం, క్రమశిక్షణ మరియు ప్రోటోకాల్‌కు లోబడి పనిచేయాల్సి ఉంటుందని శ్రీ అమృతం వీరా ఉద్ఘాటించారు. సంస్థ గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించినా, నియమావళిని ఉల్లంఘించినా యాజమాన్యం ఏమాత్రం సహించదని, భవిష్యత్తులోనూ ఇటువంటి కఠిన చర్యలు కొనసాగుతాయని ఆయన ఈ పత్రికా ప్రకటన ద్వారా హెచ్చరించారు.
ఇట్లు, అమృతం వీరా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (HRCI)











